Handloom Workers Problems : ఆధునిక కాలంలో చేనేత రంగం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కార మార్గం ఎలా? - National Handloom Day 2023
Handloom Workers Problems :ఒకనాడు రంగు రంగుల చీరలు, దోవతులు, పంచెలతో కళకళాడిన చేనేత ఉనికి నేడు ప్రశ్నార్థకంగా మారుతోంది. చేనేత మగ్గాన్ని నమ్ముకున్న కార్మికులు సరైన కూలీ లభించక... ఇతర పనులు చేయలేక కాలం వెల్లదీస్తున్నారు. మరి... ఇలాంటి పరిస్థితుల నుంచి మన ఘనమైన వారసత్వాన్ని కొనసాగించేలా... చేనేతకు చేయూతను అందించడం ఎలా? అగ్గిపెట్టెలో అమిరె చీర, కుట్టులేని దుస్తులు, మగ్గంపై మనుషుల చిత్రాలు వంటి ఎన్నో అద్భుతమైన కళాత్మక ఉత్పత్తులను రేపటి తరాలకు అంతే అందంగా... లాభసాటి ఆదాయమార్గంగా అందించడం ఎలా? చిన్నబోతున్న చేనేత మగ్గం పరిరక్షణ ఎలా? చేనేత వైపు యువతను నడిపించడం.. నేటి తరానికి అనుగుణంగా ఆ ఉత్పత్తులను తీర్చిదిద్దడంలో ఏం చేయాలి? ఆధునిక కాలంలో చేనేత రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు ఏంటి? ప్రస్తుతం కనిపిస్తున్న సమస్యలకు పరిష్కారాలు ఏంటి? చేనేత కార్మికులను గౌరవించడంతో పాటు పరిశ్రమను కాపాడుకోవడానికి చేపట్టాల్సిన చర్యలు ఏంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.