తెలంగాణ

telangana

Hanamkonda Bus Stand Issue

ETV Bharat / videos

Hanamkonda Bus Stand Issue Employee Respond : ఈటీవీ-భారత్​ కథనంపై స్పందించిన జిల్లా యంత్రాంగం - తెలంగాణ న్యూస్

By

Published : Jul 22, 2023, 4:10 PM IST

Hanamkonda Bus Stand Issue : వర్షం వస్తే చెరువులా మారుతూ.. ప్రయాణీకులకు ఇబ్బందులు, ఏంటీ? ఇది బస్టాండా..? చెరువు అనుకున్నానే..? ఇలా హనుమకొండ ఆర్టీసీ బస్టాండ్​పై ఈటీవీ, ఈటీవీ-భారత్​లో వచ్చిన  కథనంపై  ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించారు. తక్షణమే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. జిల్లాలోని అధికారులు, ప్రజాప్రతినిధులు ఆర్టీసీ బస్టాండ్​ను సందర్శించి.. మొత్తం తిరిగారు. ప్రస్తుతం పడుతున్న వర్షాలతో నీళ్లు నిలిచి చెరువులా మారుతున్న పరిస్థితిని గమనించారు. పరిసర ప్రాంతం అంతా బురదమయంగా మారిని తీరును.. అందుకు గల కారణాలను తెలుసుకున్నారు. తక్షణమే వరద నీటిని తొలగించి.. డ్రైనేజ్​ వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. గుంతలు లేకుండా రోడ్లను మరమ్మతులు చేయాలని సూచించారు. ముందుగా తాత్కాలికంగా చర్యలు చేపట్టి.. వర్షం కారణంగా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా శాశ్వత చర్యలు తీసుకుంటామని కలెక్టర్​, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఛీఫ్ విప్ వినయ్ భాస్కర్, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్ భాషా.. ఇతర అధికారులు హనుమకొండ బస్టాండ్​ను సందర్శించారు. 

ABOUT THE AUTHOR

...view details