సాగర్‌పై ఏపీ పోలీసులు దౌర్జన్యంగా మోహరించారు : గుత్తా సుఖేందర్‌రెడ్డి - Comments on Gutta Sukender Reddy Sagar
Published : Dec 2, 2023, 2:20 PM IST
Gutta Sukender Reddy Comments on AP Govt : తెలంగాణ రాష్ట్రం శాసనసభ ఎన్నికల్లో ప్రభుత్వ యంత్రాంగం బిజీగా ఉన్న సమయంలో నాగార్జున సాగర్ ఆనకట్టపై ఏపీ పోలీసులను ఆ రాష్ట్ర సర్కార్ దౌర్జన్యంగా మోహరించిందని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించారు. సాగర్ గేట్లను తెరిచి, సీసీ కెమెరాలను ధ్వంసం చేసి 5,000 క్యూసెక్కుల నీటిని తరలించడం చాలా త్రీవమైన అంశం అని గుత్తా మండిపడ్డారు. దురాలోచనతోనే ఏపీ ప్రభుత్వం ఈ దుశ్చర్యకు పాల్పడిందని ధ్వజమెత్తారు.
Gutta Sukender Reddy Fires On AP Police : ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలో ఉంటుందని సుఖేందర్ తెలిపారు. ఉభయ రాష్ట్రాల నీటి డిమాండ్ విషయంలో కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్కు తెలియజేశామని వెల్లడించారు. అక్టోబర్, జనవరి, ఏప్రిల్ నెలలో ఐదు టీఎంసీలు ఆంధ్రపదేశ్‌కు కేటాయించడం జరిగిందని చెప్పారు. ఇష్టానుసారం వ్యవహరిస్తే రాష్ట్రాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని గుత్తా అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు.