శిర్డీలో ఘనంగా గురుపూర్ణిమ వేడుకలు.. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు - శిర్డీ సాయిబాబాా టెంపుల్
శిర్డీలో మూడు రోజుల పాటు జరిగే గురుపూర్ణిమ ఉత్సవాలు సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. లక్షలాది మంది భక్తులు.. సాయి బాబా సమాధి దర్శనం కోసం శిర్డీకి తరలివెళ్లారు. ఉదయం సాయి మందిరం నుంచి కాకడ హారతి, సాయిప్రతిమ, వీణ, సాయి చరిత్ర గ్రంథాల ఊరేగింపు జరిగింది. సాయి అఖండ పారాయణం, అనంతరం గురుస్థాన్ ఆలయంలోని మార్గ్ సమాధి వద్దకు హారతిని తీసుకెళ్లి గురుపూర్ణిమ ఉత్సవాలు ప్రారంభించారు నిర్వాహకులు.
కాగా పుణె, ముంబయి, నాశిక్ మొదలైన ప్రాంతాల నుంచి వందలాది పల్లకీలు శిర్డీలోకి ప్రవేశించాయి. సోమవారం గురు పూర్ణిమ ప్రధాన రోజు కావడం వల్ల సాయిబాబా ఆలయాన్ని భక్తుల దర్శనం కోసం రాత్రంతా తెరిచే ఉంచుతామని అధికారులు తెలిపారు. గురు పూర్ణిమను వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. 1908లో సాయిబాబా, తాత్యాసాహెబ్ నూల్కర్, తాత్యాకోటే పాటిల్‌తో పాటు మరికొంతమంది భక్తులు.. వ్యాసపూర్ణిమ రోజున సాయిబాబాను గురువుగా ఆరాధించారు. అప్పటి నుంచే శిర్డీలో గురు పూర్ణిమ ప్రారంభమైంది.