హైదరాబాద్‌లో ఘనంగా గురునానక్ 553వ జయంతి వేడుకలు.. - సిక్కు మొదటి మత గురువు గురునానక్
Guru Nanak birth anniversary celebrations: సిక్కుల తొలి మత గురువు గురునానక్ దేవ్ జీ మహరాజ్ 553వ జయంతి వేడుకలు హైదరాబాద్‌లో సిక్కులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. గౌలిగూడ గురుద్వారా సాహెబ్ ఆధ్వర్యంలో పూజలు అనంతరం నగర కీర్తన శోభాయాత్ర.. గౌలిగూడ గురుద్వార్ నుంచి ప్రారంభమై.. అప్జల్ గంజ్, ఉస్మాన్ గంజ్, జాంబాగ్, ఎంజే మార్కెట్ నుంచి తిరిగి గౌలిగూడా గురుద్వార్ వరకు కొనసాగింది. ప్రత్యేక వాహనంలో మత గ్రంథం గురు గ్రంథ్ సాహిబ్‌ని ఊరేగించారు. సంప్రదాయ విన్యాసాలైన కత్తి, కర్రసాముల, గట్కా విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యుత్ దీపాలు, బ్యాండ్ వాయిద్యాలు, మహిళలు భజనలు, కీర్తనలతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST