గుంటూరు కారం మేనియా - సుదర్శన్ థియేటర్ వద్ద మహేశ్‌బాబు ఫ్యాన్స్ హంగామా - పోలీసుల లాఠీఛార్జ్ - Lathicharge Mahesh Fans
🎬 Watch Now: Feature Video
Published : Jan 12, 2024, 9:25 AM IST
|Updated : Jan 12, 2024, 10:22 AM IST
Guntur Kaaram Movie Sudarshan Theatre :ప్రపంచవ్యాప్తంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన గుంటూరు కారం సినిమా ఇవాళ విడుదలైంది. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. గురువారం సాయంత్రం నుంచే చిత్రాన్ని విడుదల చేసే థియేటర్ల సందడి వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్‌కు మహేబాబు ఫ్యాన్స్ పోటెత్తారు. ఎలాగైనా మూవీ చూడాలని క్యూ లైన్లలో బారులు తీరారు. చివరి క్షణంలోనైనా టికెట్ దొరుకుతుందన్న ఆశతో వచ్చిన అభిమానులు ఎగబడ్డారు.
Police Lathi charge on Mahesh Babu Fans in Hyderabad :అభిమానులను అదుపు చేయలేక థియేటర్ యాజమాన్యం చేతులెత్తిసింది. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడిని చేరుకొని ఫ్యాన్స్‌ను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. చేసేదేం లేక పోలీసులు లాఠీలకు పని చెప్పారు. పోలీసులు వైఖరిపై మహేశ్‌బాబు అభిమానులు మండిపడ్డారు. తమ అభిమాన హీరో సినిమా కోసం వస్తే లాఠీఛార్జ్ చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేశ్‌బాబు జిందాబాద్ అంటూ నినాదాలతో థియేటర్ పరిసరాలను హోరెత్తించారు.