Guns at Wedding Kamareddy : కత్తులు, తుపాకిీలతో డ్యాన్స్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
guns at wedding barat in kamareddy : సాధారణంగా పెళ్లి బరాత్‌లో డ్యాన్స్ చేయడం కామన్. కొంత మంది టపాసులు కాలుస్తూ స్టెప్పులేస్తూ హల్ చల్ చేస్తూ ఉంటారు. ఇంకొంత మంది మద్యం సేవిస్తూ.. మందు బాటిళ్లతో బరాత్‌లో ఒళ్లు మరిచి చిందులేస్తుంటారు. ఇంకొందరు డబ్బును ఎగజల్లుతూ స్టెప్పులేస్తూ ఉంటారు. కానీ కామారెడ్డి జిల్లాలో మాత్రం ఓ వివాహ వేడుక అనంతరం జరిగిన బరాత్‌లో కొంతమంది యువకులు కత్తులు, తుపాకులతో డ్యాన్స్ చేశారు. దీనికి సంబందించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
కామారెడ్డి జిల్లా మద్నూర్‌లో యువకులు తుపాకీ, కత్తులతో నృత్యాలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మద్నూర్లోని ఓ పెళ్లి వేడుకలో మూడు రోజుల క్రితం విందు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు యువకులు నృత్యాలు చేశారు. ఇందులో ఇద్దరి చేతుల్లో కత్తులు మరో యువకుడు చేతిలో తుపాకీ, తల్వార్లు కనిపించాయి. అక్కడే ఉన్న మరికొందరు దృశ్యాలను వీడియో తీసి ఫేస్ బుక్ లో పెట్టడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది కాస్త పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ విషయంపై స్పందించిన స్థానిక ఎస్సై కృష్ణారెడ్డి యువకులను విచారిస్తామని చెప్పారు.