తాళి కట్టే ముందు షాక్ ఇచ్చిన వధువు.. పెళ్లిపీటలపైనే మూర్ఛపోయిన వరుడు - ఒడిశా
వివాహానికి అంతా సిద్ధమయ్యారు. వధూవరులు మండపంలో కూర్చోగా పురోహితులు మంత్రాలు చదువుతున్నారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా తనకు ఇదివరకే పెళ్లి అయిందని, మరోసారి చేసుకోలేనని బాంబు పేల్చింది వధువు. పెళ్లి కూతురు ఇచ్చిన షాక్తో మండపంలోనే మూర్చపోయాడు వరుడు. ఈ సంఘటన ఒడిశా, బాలేశ్వర్ జిల్లా బలిపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేణు గ్రామంలో జరిగింది. ఉలుదా గ్రామానికి చెందిన యువకుడితో రేణు గ్రామానికి చెందిన యువతి వివాహం నిశ్చయించారు. తాళి కట్టే సమయానికి కొద్ది క్షణాలు మాత్రమే ఉందనగా.. ఒక్కసారి మండపం నుంచి లేచి చేతులకు వేసుకున్న గాజులను తొలగించింది వధువు. తనకు వేరే వ్యక్తితో ఇదివరకే వివాహం జరిగిందని, మరోసారి చేసుకోలేనని తెగేసి చెప్పింది. దీంతో షాక్తో కళ్లు తిరిగి పడిపోయాడు వరుడు. చివరి క్షణంలో ఇలాంటి పని చేయడమేంటనే కోపంతో వధువును చితకబాదారు ఆమె కుటుంబ సభ్యులు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST