వధువు కోసం హెలికాప్టర్లో వచ్చిన వరుడు.. తాతయ్య, నానమ్మ కోరిక తీర్చేందుకే
వధువును తీసుకెళ్లేందుకు హెలికాప్టర్లో వచ్చాడు వరుడు. తాతయ్య, నానమ్మ కోరిక నెరవేర్చేందుకు మనవడి ఈ ప్రయత్నం చేశాడు. దిల్లీ నుంచి ఓ హెలికాప్టర్ అద్దెకు తీసుకున్న పెళ్లికొడుకు.. తాతయ్య, నానమ్మలతో కలిసి పెళ్లికూతురు ఊరికి వెళ్లాడు. అనంతరం వధువును హెలికాప్టర్లో ఎక్కించుకుని ఏడు రౌండ్లు తిరిగాడు. అన్ని కార్యక్రమాలు ముగించుకుని తిరిగి వధువుతో సొంతూరికి బయలుదేరాడు. హెలికాప్టర్లో వచ్చిన జంటను చూసేందుకు భారీగా ఎగబడ్డారు జనం. రాజస్థాన్ కోటా జిల్లాలోని బంధ ధర్మపురకు చెందిన సునీల్ అనే వ్యక్తి ఇలా వినూత్నంగా హెలికాప్టర్లో వచ్చాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావా పట్టణానికి చెందిన రేఖా అనే యువతిని వివాహం చేసుకున్నాడు. గురువారం వీరి వివాహం జరిగింది.