పెళ్లి తర్వాత భార్యకు గిఫ్ట్‌గా హెలికాప్టర్ రైడ్ - హెలికాప్టర్‌లో వరుడి ఇంటికి వధువు
వివాహం అనంతరం హెలికాప్టర్‌లో ఇంటికి వెళ్లి నవదంపతులు వార్తల్లోకెక్కారు. ఉత్తర్‌ప్రదేశ్ రూడ్కీలోని చావ్మండీకి చెందిన సంజయ్ కుమార్ కుమారుడి వివాహం ఉత్తర్‌ప్రదేశ్ బిజ్నోర్ జిల్లాకు చెందిన నేహా ధీమాన్‌తో వివాహం నిశ్చయమైంది. డిసెంబర్ 2న బిజ్నోర్ చాంద్పుర్లో వీరి వివాహం జరిగింది. కాగా వివాహం అనంతరం వధువును హెలికాప్టర్‌లో ఇంటికి తీసుకొచ్చాడు వరుడు. దీంతో చావ్మండీలో సందడి నెలకొంది. హెలికాప్టర్‌ను చూసేందుకు స్థానికులు అక్కడికి తరలివెళ్లారు. చిన్నారులు ఆసక్తిగా హెలికాప్టర్‌ను తిలకించారు.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST