తెలంగాణ

telangana

OU సీఐకి అట్టహసంగా జరిగిన వీడ్కోలు.. కన్నీటిపర్యంతమైన OU విద్యార్థులు

ETV Bharat / videos

Farewell to OU CI Ramesh : ఓయూ సీఐకి విద్యార్థుల ఘన వీడ్కోలు.. పలువురి భావోద్వేగం - telangana latest news

By

Published : May 20, 2023, 7:19 PM IST

Great Farewell to OU CI Ramesh : విద్యాబుద్ధులు నేర్పిన గురువులు బదిలీ అయినప్పుడు విద్యార్థులు ఆత్మీయ వీడ్కోలు పలకటం సహజం. స్కూల్​లో విద్యాబుద్ధులు నేర్పిన టీచర్ బదిలీ అయితే అక్కడి విద్యార్థులు గురువులకు ఆత్మీయ వీడ్కోలు పలికిన విధంగా.. సీఐ అధికారికి ఆత్మీయంగా వీడ్కోలు పలికిన ఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్​లో జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ సీఐకి విద్యార్థులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఎన్నడూ లేని విధంగా పోలీస్ అధికారికి విద్యార్థులు, పోలీస్ సిబ్బంది గొప్ప వీడ్కోలు ఇచ్చారు.

ఓయూ పోలీస్​ స్టేషన్​లో వివిధ హోదాల్లో పని చేసిన సీఐ రమేశ్‌కు బదిలీ ఉత్తర్వులొచ్చాయి. ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు సంఘాలకు అతీతంగా విద్యార్థులు, పోలీసులు కలిసి బాజాభజంత్రీలతో, పూలు చల్లుతూ, నృత్యాలతో వీడ్కోలు పలికారు. సీఐ రమేశ్​ను ఓపెన్‌ టాప్‌ జీపులో యూనివర్సిటీలో ఊరేగించారు. ఈ క్రమంలో పలువురు విద్యార్థులు, పోలీస్‌ సిబ్బంది భావోద్వేగానికి లోనయ్యారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details