రిటైరైన BSF శునకాలకు గ్రాండ్ ఫేర్వెల్ వాహనంపై ఊరేగింపు
హిమాచల్‌ప్రదేశ్‌లోని కుల్లూలో 2014 నుంచి బీఎస్ఎఫ్ తరఫున భుంటార్ విమానాశ్రయంలో సేవలందించిన సామ్, మ్యాక్స్ అనే రెండు శునకాల పదవీ విరమణ వేడుకలు ఘనంగా జరిగాయి. శునకాల కోసం రెడ్ కార్పెట్ పరిచి సందడి చేశారు జవాన్లు. వాహనంపై ఊరేగించిన సిబ్బంది అనంతరం కేకు కోసి పంచుకున్నారు. ఆ తర్వాత వాటి సేవలను గుర్తు చేస్తూ గ్రాండ్ సెల్యూట్ చేశారు. కాసేపటి తర్వాత పూలమాలలతో సత్కరించిన విమానాశ్రయ భద్రతా సిబ్బంది సామ్, మాక్స్‌కు ఘనంగా వీడ్కోలు తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST
TAGGED:
himachal pradesh latest news