ఉన్నతాధికారులు తమ పిల్లలను ప్రభుత్వం పాఠశాలల్లో చదివించాలి : గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
Published : Jan 9, 2024, 7:33 PM IST
Governor Tamilisai about Government Schools :ఉన్నతాధికారులు తమ పిల్లలను ప్రభుత్వం పాఠశాల్లో చదివించాలని, అప్పుడే పాఠశాలలకు ఆదరణ పెరుగుతుందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆకాంక్షించారు. హైదరాబాద్ రాజ్‌భవన్‌లో అక్షయ విద్యా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు గవర్నర్ ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌తో పాటు అక్షయ విద్యా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సురేందర్‌మోహన్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మహిళా సాధికారతే సమాజంలో మార్పునకు నాంది కావాలన్న తమిళిసై, స్త్రీ ఉన్నత విద్యావంతురాలు కావాలంటే ప్రతి ఒక్కరూ సహకారం, ప్రోత్సాహం అందించాలన్నారు.
Governor Suggestions on Government Schools :ప్రభుత్వ పాఠశాలలో పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయులు సైతం తమ పిల్లలను ప్రైవేట్ స్కూల్‌లో చదివించడం విచారకరమని గవర్నర్ తమిళిసై అన్నారు. కలెక్టర్లు, ఉపాధ్యాయులు, అధికారులు తమ పిల్లలను ప్రభుత్వం పాఠశాల్లో చదివించేందుకు చొరవ తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం కొందరు జిల్లా కలెక్టర్లు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేస్తున్నారని, దీని వల్ల ప్రభుత్వ పాఠశాలల మీద ఒక నమ్మకం పెరుగుతోందని ఆమె వివరించారు.