తెలంగాణ

telangana

CM KCR Response on Gaddar Death

ETV Bharat / videos

Governor and CM KCR Condoles on Gaddar Death : గద్దర్​ కుటుంబానికి సంతాపం తెలిపిన గవర్నర్​, సీఎం - తెలంగాణ వార్తలు

By

Published : Aug 6, 2023, 7:23 PM IST

Updated : Aug 6, 2023, 7:34 PM IST

CM KCR Response on Gaddar Death : గద్దర్‌ మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌, గవర్నర్ తమిళసై, మంత్రి కేటీఆర్​ సంతాపం తెలిపారు. తెలంగాణ పాటకు ప్రపంచ ఖ్యాతి తెచ్చిన ప్రజాగాయకుడని సీఎం కేసీఆర్​ కొనియాడారు. తన ఆటపాటలతో ప్రజల్లో స్వరాష్ట్ర చైతన్యం రగిలించారని అన్నారు. అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.  

సుప్రసిద్ధ కవి, విప్లవ వీరుడు, ఉద్యమకారుడు గద్దర్ అలియాస్‌ గుమ్మడి విఠల్‌రావు మృతి పట్ల రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి తీరని లోటు అన్నారు. రాష్ట్రంపై తన అద్భుతమైన కవితా శైలి, నాయకత్వ పటిమతో గొప్ప చెరగని ముద్ర వేసిన ఒక ప్రముఖ కవి, ఉద్యమకారుడిని కోల్పోయిందని అన్నారు. ఈ మేరకు గవర్నర్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఓ సంతాప సందేశం విడుదల చేశారు. 

గద్దర్ కుటుంబ సభ్యులు, అనుచరులకు గవర్నర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.  గద్దర్ మృతి పట్ల శాసనసభ సంతాపం తెలిపింది. శాసనసభలో మంత్రి కేటీఆర్ సంతాప ప్రకటన చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని మంత్రి తెలిపారు.

Last Updated : Aug 6, 2023, 7:34 PM IST

ABOUT THE AUTHOR

...view details