తెలంగాణ

telangana

Sircilla Handloom Golden Saree Gift to Yadadri

ETV Bharat / videos

Golden Saree in Match Box For Yadadri Narasimha Swamy : అగ్గిపెట్టెలో బంగారు చీర, శాలువా.. యాదాద్రీశుడికి బహుకరించిన నేతన్న - చేనేత నేత 2 గ్రాముల బంగారు చీరను అందజేత

By ETV Bharat Telangana Team

Published : Oct 31, 2023, 10:55 PM IST

Golden Saree in Match Box For Yadadri Narasimha Swamy :తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారికి నేత కార్మికుడు నల్ల విజయ్‌ రెండు గ్రాముల బంగారంతో అగ్గిపెట్టెలో ఇమిడేలా తయారు చేసిన చీర, శాలువను బహుకరించారు. విజయ్​ తరచుగా అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసి.. తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలకు కానుకగా సమర్పిస్తూ ఉంటారు. ఇటీవలే వేములవాడ రాజేశ్వరి దేవికి కానుక సమర్పించారు. తాజాగా యాదాద్రీశుడికి పూజలు నిర్వహించి.. ఆలయ అధికారులకు చీరను అందచేశారు. స్వామి వారికి బహుకరించి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.

సిరిసిల్లకు చెందిన నేత కార్మికుడు నల్ల విజయ్ వారసత్వంగా నేత పనిని కొనసాగిస్తూ వస్తున్నారు. తన తండ్రి గతంలో అగ్గిపెట్టెలో ఇమిడే చీరలను నేసి ఆలయాలు, ప్రజాప్రతినిధులకు బహుకరించేవారు. ఆ వారసత్వాన్ని తాను కొనసాగించాలనే ఉద్దేశంతో తాను కూడా ఈ చీరలను ఆలయాలకు బహుకరిస్తున్నట్లు నల్ల విజయ్ తెలిపారు. రెండు గ్రాముల బంగారంతో అగ్గిపెట్టెలో ఇమిడేలా ఈ చీర, శాలువను తయారు చేశానని చెప్పారు. గతంలో తాను మొదటగా తిరుమల తిరుపతి దేవస్థానంలో.. తర్వాత విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో బంగారంతో నేసిన చీరలను బహుకరించినట్టు వివరించారు. అందులో భాగంగానే యాదాద్రి ఆలయంలోనూ ఈ చీరను సమర్పించిట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details