తెలంగాణ

telangana

Golden Mini Cricket World Cup

ETV Bharat / videos

Golden Mini Cricket World Cup : 0.9 గ్రాముల బుల్లి 'గోల్డ్'​ వరల్డ్​కప్.. రోహిత్​కు ఇవ్వాలని డ్రీమ్!.. వీడియో చూశారా? - one gram gold world cup trophy

By ETV Bharat Telugu Team

Published : Oct 13, 2023, 10:08 AM IST

Golden Mini Cricket World Cup :గుజరాత్​ అహ్మదాబాద్​కు చెందిన రౌఫ్ షేక్ అనే గోల్డ్​స్మిత్.. 0.9 గ్రా బరువు గల అతి చిన్న బంగారు ప్రపంచకప్ ట్రోఫీ​ తయారు చేశాడు. అయితే ఇలాంటి ఆవిష్కరణలు చేయడంలో ఆసక్తి చూపే రౌఫ్.. గతంలో కూడా చిన్న చిన్న ట్రోఫీలు చేశాడు. ఇదివరకు రౌఫ్ 2014లో 1.2 గ్రాములు, 2019లో ఒక గ్రాము బరువుతో వరల్డ్​కప్ ట్రోఫీని చేశాడు. కాగా, ఇప్పుడు నెలన్నర రోజులు కష్టపడి 0.9 గ్రా తో అతి చిన్న ట్రోఫీ తయారు చేసి తన రికార్డును తానే బ్రేక్ చేశాడు. ఇక  2023 వరల్డ్​కప్​ అక్టోబర్ 14న జరిగే భారత్-పాకిస్థాన్ మ్యాచ్​లో.. టీమ్ఇండియా కెప్టెన్​ రోహిత్ శర్మకు ఇవ్వాలని ఆశిస్తున్నట్లు రౌఫ్ తెలిపాడు. "ప్రత్యేకంగా చేసిందంటూ ఏమీ లేదు. ఇలాంటివి తయారు చేయడం నాకిష్టం. ట్రోఫీని చేయడానికి టార్గెట్ అంటూ ఏమి పెట్టుకోలేదు. ఆసక్తి ఉన్నప్పుడల్లా ఒకటి, రెండు గంటలు కేటాయించేవాడిని. అందుకే పూర్తి అయ్యేందుకు నెలన్నర సమయం పట్టింది. అక్టోబర్ 14న భారత్-పాకిస్థాన్ మ్యాచ్​ సందర్భంగా టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ ట్రోఫీ ఇవ్వాలనుకుంటున్నా' అని రౌఫ్ పేర్కొన్నాడు.

ABOUT THE AUTHOR

...view details