Golden Chandrayaan 3 : 4 గ్రాముల బంగారం.. ఒకటిన్నర అంగుళాలతో బుల్లి 'చంద్రయాన్-3' చూశారా?
Golden Chandrayaan 3 :భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్- 3మిషన్ విజయవంతం కావాలని యావద్దేశ ప్రజలు కోరుకుంటున్నారు. అందుకోసం కొందరు పూజలు.. మరికొందరు యాగాలు కూడా చేస్తున్నారు. తాజాగా తమిళనాడులోని కోయంబత్తూర్‌కు చెందిన మరియప్పన్ అనే కళాకారుడు నాలుగు గ్రాముల బంగారంతో చంద్రయాన్- 3 మిషన్ నమూనాను తయారు చేశాడు. దీన్ని తయారు చేసేందుకు 48 గంటలపాటు శ్రమించినట్లు మరియప్పన్ తెలిపాడు.
Chandrayaan 3 Golden Sample : ఒకటిన్నర అంగుళాల పొడవుతో చంద్రయాన్-3 ల్యాండర్ నమూనాను రూపొందించినట్లు మరియప్పన్ చెప్పాడు. చంద్రయాన్-3 మిషన్ మాడ్యూల్ ల్యాండర్.. ఆగస్టు 23వ తేదీ చంద్రుడి దక్షిణధ్రువం ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ కానుంది. అంతరిక్షరంగంలో భారత ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసే చంద్రయాన్-3 మిషన్ కోసం శ్రమించిన శాస్త్రవేత్తలపై అభిమానాన్ని చాటుతూ ఈ నమూనాను రూపొందించినట్లు మరియప్పన్ తెలిపాడు. మరి.. చంద్రయాన్-3 వల్ల భారత్‌కు ప్రయోజనాలేంటో తెలుసుకోవాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.