బోరుబావి నుంచి బయటకు వస్తున్న బంగారం.. ఎగబడుతున్న జనం! - వైరల్ వీడియోలు
ఒడిశాలోని బలంగిర్ జిల్లాలో ఆశ్చర్యకర సంఘటన వెలుగులోకి వచ్చింది. బోరుబావిలో నుంచి బంగారం బయటకు వస్తోంది. మిలమిల మెరుస్తూ బయటకు వస్తున్న బంగారాన్ని చూసి.. స్థానిక ప్రజలంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మహమ్మద్ జావేద్ అనే రైతు.. తన పొలంలో తవ్వించిన బావిలో నుంచి ఇలా బంగారం బయటకు వస్తోంది. నెల రోజుల క్రితం జావేద్ తన పొలంలో బావిని తవ్వించాడు. అనంతరం ఈ మధ్యే బావిలోకి పైపులు దింపి.. మోటారును స్టార్ట్ చేశాడు. బోరుబావిలో నుంచి నీరంతా బురదగా రావడం, పసుపు రంగులో కొన్ని పదార్థాలు మెరవడం గమనించాడు. స్థానికులు సైతం దీన్ని గమనించారు. దీంతో ఈ వార్తా ఊరంతా పాకింది. స్థానికులంతా దీనిని చూసేందుకు వస్తున్నారు. దీని గురించి సమాచారం అందుకున్న అధికారులకు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అనంతరం నీటిని పరీక్షించారు. శాంపిల్‌ను సేకరించి ప్రయోగశాలకు పంపించారు. ఇది బంగారమా కాదా అన్న విషయం ఇప్పుడే చెప్పలేమని అధికారులు వెల్లడించారు. శాస్త్రీయంగా పరీక్షించిన అనంతరం దాని గురించి వాస్తవం తెలుస్తుందన్నారు.