తెలంగాణ

telangana

నగల షాప్​లో దొంగలు

ETV Bharat / videos

Gold Shop Robbery Viral Video : నగల దుకాణంలో చోరీ.. అడ్డొచ్చిన పోలీసులపై కాల్పులు.. ఆఖరికి.. - నగల దుకాణంలో దొంగతనం

By ETV Bharat Telugu Team

Published : Aug 30, 2023, 2:53 PM IST

Updated : Aug 30, 2023, 3:23 PM IST

Gold Shop Robbery Viral Video : బంగాల్​లో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. మారణాయుధాలతో నగల షాప్​లోకి చొరబడి దొంగతనం చేశారు. పారిపోతున్న దొంగలను అడ్డుకున్న పోలీసులపై కాల్పులు జరిపారు. రాణాఘాట్​లోని సెన్​కో నగల దుకాణంలో ఎనిమిది మంది దొంగలు దోపిడీ చేసి పారిపోయే ప్రయత్నం చేశారు.  

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాణాఘాట్​లోని ఓ నగల దుకాణంలోకి ఇద్దరు దొంగలు ప్రవేశించారు. అనంతరం మరో ఆరుగురు దొంగలు షాప్​లోకి చొరబడ్డారు. దోపిడీ అనంతరం ముగ్గురు దొంగలు బైక్​పై పారిపోయే ప్రయత్నం చేశారు. వారిని అడ్డుకున్న పోలీసులపై దొంగలు కాల్పులు జరిపారు. పారిపోతున్న మిగతా నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి దొంగిలించిన నగలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఎనిమిది మంది దొంగలు షాప్​లో దోపిడీ చేశారని, ఐదుగురు నిందితులను అరెస్ట్​ చేశామని పోలీసులు తెలిపారు. దొంగలు బిహార్​కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. సుమారు రూ. కోటి విలువైన బంగారు, వెండి, వజ్రాలను దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు.

Last Updated : Aug 30, 2023, 3:23 PM IST

ABOUT THE AUTHOR

...view details