Gold Chain Robbed a Woman : లాటరీ వచ్చిందని నమ్మించాడు.. మహిళ నుంచి బంగారం దోచేశాడు... - Chain theft from a woman latest news
Gold Chain Robbed a Woman : కేటుగాళ్లు కొత్త ఎత్తుగడలతో మోసాలకు పాల్పడుతున్నారు. నమ్మకం కలిగే విధంగా నటిస్తూ.. అమాయకులను, వృద్ధులు బురిడి కొట్టిస్తున్నారు. బాధితులు ఇది మోసమని.. గ్రహించేలోపే అక్కడినుంచి పరారవుతున్నారు. తాజాగా నిర్మల్ జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. కుంటాల మండలంలోని కల్లూరు గ్రామానికి పెద్దమ్మి అనే మహిళ వద్దకు.. ఓ వ్యక్తి వచ్చాడు. మీరు సిమ్‌కార్డు పోర్ట్ పెట్టారని ఆమెను అడిగాడు.
పెద్దమ్మి అవునని.. అతనికి సమాధానం చెప్పింది. ఈ క్రమంలోనే అతడు.. మీరు సిమ్‌కార్డు మార్చడం వల్ల రూ.2 లక్షల లాటరీ వచ్చిందని ఆమెను నమ్మించాడు. ఇందులో భాగంగానే సదరు మహిళను.. ద్విచక్రవాహనంపై ఎక్కించుకొని ఓ ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే మాయామాటలు చెప్పిన కేటుగాడు.. ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును తీసి ఇవ్వమన్నాడు. సరే అని నమ్మిన బాధితురాలు.. ఆ కేటుగాడికి.. రెండు తులాల బంగారు గొలుసు తీసి ఇచ్చింది. కొద్దిసేపు ఇలాగే మాటల్లో పెట్టి నిందితుడు.. ఆమె దృష్టి మరల్చి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. మోసపోయానని గ్రహించిన పెద్దమ్మి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.