తెలంగాణ

telangana

Godavari

ETV Bharat / videos

Godavari Water level Bhadrachalam : గోదావరికి పెరుగుతున్న ప్రవాహం.. 19 అడుగులకు చేరిన నీటిమట్టం - Godavari

By

Published : Jul 14, 2023, 1:03 PM IST

Updated : Jul 14, 2023, 7:56 PM IST

Godavari Water level at Bhadrachalam Today : భద్రాచలం వద్ద గోదావరి ఉరకలెస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావం ఉన్నా.. భద్రాద్రి జిల్లాలో ఎగువన కురుస్తున్న వర్షాలతో భద్రాద్రి వద్ద ప్రవాహం పెరుగుతోంది. గోదావరి ఎగువ ప్రాంతంలో ఉన్న తాలువేరు ప్రాజెక్టు నుంచి నీటి విడుదలతో పాటు.. పై రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల వల్ల వరద నీరు వస్తోంది. గురువారం ఉదయం 13 అడుగులు ఉన్న నీటిమట్టం.. సాయంత్రానికి 15 అడుగులకు చేరింది.  క్రమంగా వస్తున్న వరదతో ఉదయం 18 అడుగులుగా నమోదైంది. సాయంత్రానికి 19 అడుగులకు చేరి ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతం నుంచి ప్రవాహం పెరుగుతున్నందున భద్రాచలం వద్ద గోదావరి వరద పెరుగుతోందని కేంద్ర జల సంఘం అధికారులు తెలిపారు. మొన్నటి వరకు తక్కువగా ఉన్న వరద పెరగడంతో ప్రవాహం స్నానఘట్టాల ప్రాంతం వద్దకు చేరుకుంది. అయితే గత ఏడాదితో పోల్చితే ఇది చాలా తక్కువ. గత సంవత్సరం ఈ సమయానికి 40 అడుగులను దాటి ప్రవహించింది.

Last Updated : Jul 14, 2023, 7:56 PM IST

ABOUT THE AUTHOR

...view details