తెలంగాణ

telangana

Godavari Latest News

ETV Bharat / videos

Godavari Flood Effect Bhadrachalam : వరద పోయి.. బురద మిగిలే.. ఇదీ భద్రాచలం వద్ద పరిస్థితి - Bhadrachalam floods 2023

By

Published : Aug 10, 2023, 12:34 PM IST

Updated : Aug 10, 2023, 12:42 PM IST

Godavari Flood Effect Bhadrachalam : భద్రాచలంలోని గోదావరి నది స్నానఘట్టాల ప్రాంతం మొత్తం బురద మయంగా మారింది. గత నెలలో భద్రాచలం వద్ద గోదావరి మహోగ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే.. నీటి ప్రవాహం ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతుంది. నాటి వానల ఉద్ధృతికి గోదావరి స్నాన ఘట్టాలన్నీ వరద నీటిలో మునిగాయి. ప్రస్తుతం గోదావరికి వరద తగ్గడంతో ఆ ప్రాంతంలో పేరుకు పోయిన బురద అంతా బయటపడింది.

Bhadrachalam floods 2023 :ముఖ్యంగా భద్రాచలం స్నానఘట్టాల ప్రాంతం మొత్తం సుమారు రెండు అడుగుల మేర బురద పేరుకుపోయి ఉంది. భద్రాద్రి రాముడి సందర్శనకు వచ్చిన భక్తులు స్నానఘట్టాల వద్దకు రాగానే ఆ ప్రాంతాన్ని చూసి షాక్ అవుతున్నారు. అక్కడి స్నానమాచరించడానికి ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వీలైనంత త్వరగా బురదను తొలగించాలని కోరుతున్నారు. నిన్నటి దాకా వరద.. ఇప్పుడేమో బురద.. వాన పడిన ప్రతిసారి ఈ ఇబ్బందులు తప్పడం లేదంటూ వాపోతున్నారు. దర్శనానికి వచ్చే తామే ఇంతలా ఇబ్బందులు పడుతుంటే.. ఇక స్థానికుల బాధ వర్ణనాతీతమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Last Updated : Aug 10, 2023, 12:42 PM IST

ABOUT THE AUTHOR

...view details