సీఎం దంపతుల ఆధ్వర్యంలో ప్రగతిభవన్‌లో ఘనంగా గోదాదేవి కల్యాణం - సీఎం దంపతుల ఆధ్వర్యంలో గోదాదేవి కల్యాణం
ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతుల ఆధ్వర్యంలో గోదాదేవి కల్యాణం ఘనంగా జరిగింది. శ్రీరంగనాథుని నిత్య పూజలతో సేవించి శ్రీవారికి తన జీవితాన్ని అర్పించిన మహా భక్తురాలు గోదాదేవి కల్యాణ మహోత్సవాన్ని ప్రగతిభవన్‌లో ఘనంగా నిర్వహించారు. వేద పండితులు, వేద మంత్రోచ్ఛరణల మధ్య శాస్త్రోక్తంగా సాగిన కల్యాణ క్రతువు సీఎం కేసీఆర్, ఆయన సతీమణి శోభ ఆధ్వర్యంలో కన్నుల పండువగా సాగింది. హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి ఏటా ధనుర్మాసంలో 30 రోజుల పాటు సాగే శ్రీ ఆండాళ్ అమ్మవారి తిరుప్పావై పాశురాల పఠనం అనంతరం గోదాదేవి కల్యాణంతో ధనుర్మాస వ్రతం ముగుస్తుంది. ప్రగతిభవన్‌లో జరిగిన గోదాదేవి కల్యాణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సోదరీమణులు, కుటుంబసభ్యులు పాల్గొన్నారు.