చిరుత పిల్లలను ఇంటికి తెచ్చేసిన మేకల కాపరి.. ఆ తర్వాత ఏమైందంటే? - చిరుత పిల్లలను రక్షించిన ఫారెస్ట్ అధికారులు
హరియాణా.. నుహ్‌కు చెందిన ఓ మేకల కాపరి అడవిలో నుంచి రెండు చిరుత పిల్లలను ఇంటికి తెచ్చేశాడు. ఈ విషయం అటవీ అధికారుల దృష్టికి చేరింది. వెంటనే వారు మేకల కాపరి ఇంటికి చేరుకుని చిరుత కూనలను స్వాధీనం చేసుకున్నారు. మేకల కాపరి.. ఓ ఆడ, మగ చిరుత కూనలను తీసుకొచ్చినట్లు అటవీ అధికారులు తెలిపారు.
'ఒక మేకల కాపరి అడవిలో ఉన్న రెండు చిరుత పిల్లలను ఇంటికి తీసుకొచ్చేశాడు. అందులో ఒకటి మగ, ఇంకొకటి ఆడ చిరుత పిల్ల. ఈ రెండు చిరుత పిల్లలు ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాయి. వాటిని అడవిలో వదిలేస్తాం. అవి వాటి తల్లిని గుర్తించి కలిసిపోతాయని అనుకుంటున్నాం. చిరుత కూనలు తల్లి దగ్గరికి చేరలేకపోతే వాటిని సంరక్షణ కేంద్రం లేదా జూకి తరలిస్తాం' అని డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డీఎఫ్‌ఓ) రాజేశ్ కుమార్ చెప్పారు.
Caged leopard burnt alive: కొన్నాళ్ల క్రితం.. బోనులో పట్టుబడ్డ చిరుతను సజీవదహనం చేశారు కొందరు ప్రజలు. అటవీశాఖ అధికారుల వారిస్తున్నా వినకుండా వారి ముందే ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ అమానవీయ ఘటన ఉత్తరాఖండ్‌లోని పౌరీ జిల్లా సప్లోరీ గ్రామంలో జరిగింది. ఈ ఘటనలో 150 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.