మనిషి ముఖాన్ని పోలిన మేకపిల్లను చూసేందుకు జనం బారులు - జన్యులోపంతో పుట్టిన మేకపిల్ల
మధ్యప్రదేశ్ విదిశా జిల్లాలోని సెమాల్కేడి గ్రామంలో ఓ మేక వింత ఆకారంలో ఉన్న పిల్లకు జన్మనిచ్చింది. ముందు నుంచి చూస్తే అచ్చం మనిషి ముఖాన్ని పోలి ఉన్న ఆ వింత మేకపిల్లను చూసేందుకు గ్రామస్థులు పెద్ద ఎత్తున వెళ్తున్నారు. అయితే మేకపిల్ల జన్యులోపంతో పుట్టినట్లు పశువైద్యులు తెలిపారు. మేకపిల్ల తన నోటితో తల్లి పాలను తాగలేకపోతోంది. దీంతో సిరంజీతో ఆ మేక పిల్లకు పాలు పట్టిస్తున్నామని యజమానులు వెల్లడించారు.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST