తెలంగాణ

telangana

resiling

ETV Bharat / videos

కుస్తీ పోటీల్లో బాలురను ఓడించిన బాలిక.. చూస్తే ఔరా అనక మానరు మరీ! - కామారెడ్డిలో జరిగిన కుస్తీ పోటీల్లో బాలిక విజయం

By

Published : Apr 1, 2023, 10:28 PM IST

ప్రస్తుత కాలంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. నేటి సమాజంలో వంటింటికే పరిమితం కాకుండా వెలుపలికి వచ్చి వారి సత్తాను బయట ప్రపంచానికి చాటి చెపుతున్నారు. పురుషులతో సమానంగా పని చేస్తున్నారు.. మగవారితో సరిసమానంగా అన్నింటిలో ముందుకు దూసుకుపోతున్నారు. అయితే ఈ సన్నివేశం చూస్తే మగ మహారాజులు.. ఆడవాళ్ల చేతిలో కంగుతిన్న సంఘటనను చూడవచ్చు. అదీ కూడా రెజ్లింగ్​ పోటీలో.. ఏంటి రెజ్లింగ్​లోనా ఓడించారా అని ఆశ్చర్యపోతున్నారు కదా. మరి చూస్తే ఇంకెంతలా అవాక్కు అవుతారో మరి.

కామారెడ్డి జిల్లాలో ఓ బాలిక కుస్తీ పోటీల్లో అదరగొట్టింది. పురుషులతో పోటీ పడి.. ఏకంగా వారిపై గెలిచి ఔరా అనిపించింది. శ్రీరామనవమిని పురస్కరించుకొని పిట్లం మండల కేంద్రంలో కుస్తీ పోటీలు నిర్వహించారు. పిట్లం పరిసర గ్రామాలతో పాటు సంగారెడ్డి, మెదక్​లతో పాటు పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు గ్రామాల నుంచి ఔత్సాహిక మల్లయోధులు పోటీల్లో పాల్గొన్నారు. పోటీల్లో మహారాష్ట్ర విదర్భ జిల్లా పుస్సత్ గ్రామానికి చెందిన 16ఏళ్ల బాలిక పల్లవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యువకులతో పోటీ పడి అందర్నీ ఆశ్చర్య పరిచి.. పోటీల్లో విజేతగా నిలిచి ప్రశంసలు అందుకుంది.

ABOUT THE AUTHOR

...view details