Girl Suicide Attempt Viral Video : తండ్రి తిట్టాడని బాలిక ఆత్మహత్యాయత్నం.. 'రాఖీ' సెంటిమెంట్‌తో కాపాడిన ACP - ఆత్మహత్య నుంచి బాలికను కాపాడిన వ్యక్తి
Published : Sep 1, 2023, 10:38 AM IST
Girl Suicide Attempt Viral Video :తండ్రి తిట్టాడని ఓ బాలిక ఆత్మహత్యయత్నం చేసింది. భవనంపై నుంచి దూకేయడానికి ప్రయత్నించింది. సమాచారం అందుకున్న ఏసీపీ.. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని బాలికకు నచ్చజెప్పారు. రాఖీ కడితే తాను సపోర్ట్ చేస్తానని బాలికను ఒప్పించారు. చివరకు బాలికను సురక్షితంగా కాపాడి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ ఘటన ఉత్త్ర్ప్రదేశ్లోని గాజియాబాద్‌లో జరిగింది.
ఇదీ జరిగింది..అభయ్ కండ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ బాలికను తన కుటుంబంతో పాటు నివసిస్తోంది. ఈ ఏడాది జులైలో తన తల్లి చనిపోయింది. అయితే ఇటీవల తన తండ్రి తిట్టాడని మనస్తాపానికి గురైన బాలిక గురువారం ఆత్మహత్య చేసుకోడానికి తన అపార్ట్మెంట్లోని నాలుగో అంతస్తు పైకుప్పు ఎక్కింది. దీనిపై సమాచారం అందుకున్న ఏసీపీ స్వతంత్ర సింగ్.. బాలికతో మాట్లాడారు. దీంతో బాలిక తన ఆవేదన వెళ్లగక్కింది. తన తండ్రి ప్రవర్తన బాగోలేదని తెలిపింది. తన కుటుంబ సభ్యులు మద్దతు తెలపడం లేదని చెప్పింది. అయితే తనకు రాఖీ కడితే తాను సపోర్ట్ చేస్తానని ఏసీపీ.. బాలికకు హామీ ఇచ్చారు. అనంతరం బాలికకు నచ్చజెప్పి సురక్షితంగా కాపాడారు. ఆ తర్వాత బాలిక స్పృహ తప్పిపడిపోయింది.