గ్రేటర్ హైదరాబాద్ పోలింగ్ కేంద్రాలకు సర్వం సిద్ధం - ఇక యూపీఐ పేమేంట్స్పై నిఘా
Published : Nov 28, 2023, 8:11 PM IST
GHMC Commissioner Interview On Assembly Polling : నలభై ఎనిమిది గంటల సైలెంట్ సమయంలో పెద్ద ఎత్తున నిఘా పెడుతున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ వెల్లడించారు. గ్రేటర్లో 15 నియోజకవర్గాల్లో.. మొత్తం 4119 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు తెలిపారు. గ్రేటర్లో 180 మోడల్ పోలింగ్ కేంద్రాల్లో 75 స్త్రీలు, 15 దివ్యాంగులు, 15 యూత్ మేనేజ్ చేసే పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
ఇక యూపీఐ పేమేంట్స్ పై ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేశామని.. లక్ష రూపాయల పైబడి కూడా ఒకే అకౌంట్స్ నుంచి.. ఎక్కువ మందికి నగదు బదిలీ జరిగే యూపీఐ పేమేంట్స్పై నిఘా ఏర్పాటు చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు. ఒకే కుటుంబ సభ్యులందరి ఓటు.. ఒకే పోలింగ్ బూత్‌లో ఏర్పాటు చేశామన్నారు. పోస్టల్ బ్యాలేట్ ఎన్నికల సిబ్బంది అందరు వినియోగించుకోవచ్చని వెల్లడించారు. పోలింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామంటున్న జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్తో ఈటీవీ భారత్ ముఖాముఖి.