తెలంగాణ

telangana

Gautam_Gambhirs_Couple at Tirumala

ETV Bharat / videos

Gautam Gambhir Visits Tirumala Temple: తిరుమల శ్రీవారి సేవలో గౌతమ్ గంభీర్ దంపతులు.. - టీటీడీ లేటెస్ట్ న్యూస్

By ETV Bharat Telugu Team

Published : Sep 28, 2023, 3:29 PM IST

Gautam Gambhir Visits Tirumala Temple: తిరుమల శ్రీవారిని మాజీ క్రికెట్‌ ఆటగాడు, పార్లమెంటు ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ దర్శించుకున్నారు. సతీమణితో కలిసి గురువారం ఆయన.. స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ సిబ్బంది వారికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. పలువురు క్రికెట్ అభిమానులు గంభీర్​తో ఫోటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు ఉత్సాహం చూపారు. ఆయన తిరుమల ఆలయ ప్రాంగణంలో ఉన్నంతవరకు సందడి వాతావరణం నెలకొంది. కాగా ఈ క్రమంలో మాట్లాడిన ఆయన.. క్రికెట్ వరల్డ్ కప్ పోటీల్లో భారత జట్టు విజయం సాధించేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని అన్నారు. 140 కోట్ల భారతీయుల ప్రార్థనలతో భారత్‌ జట్టు కచ్చితంగా వరల్డ్ కప్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

"క్రికెట్ వరల్డ్ కప్ పోటీల్లో భారత జట్టు విజయం సాధించేందుకు మంచి అవకాశాలు ఉన్నాయి. 140 కోట్ల భారతీయుల ప్రార్థనలతో భారత్‌ జట్టు కచ్చితంగా వరల్డ్ కప్ గెలుస్తుంది." - గౌతమ్ గంభీర్, మాజీ క్రికెట్‌ ఆటగాడు, పార్లమెంటు ఎంపీ గౌతమ్‌

ABOUT THE AUTHOR

...view details