తెలంగాణ

telangana

Gas Cylinder Truck Explosion

ETV Bharat / videos

​పేలిన గ్యాస్​ సిలిండర్ల ట్రక్కు.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. డ్రైవర్​, ఆపరేటర్ చాకచక్యంగా.. - గ్యాస్​ సిలిండర్​ లారీకి మంటలు ఉత్తరాఖండ్​ టెహ్రీ

By

Published : Jun 29, 2023, 11:03 AM IST

Gas Cylinder Truck Explosion : ఉత్తరాఖండ్​ టెహ్రీ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎల్​పీజీ సిలిండర్లలతో వెళ్తున్న ట్రక్కులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ తర్వాత కొద్ది సేపటికే ట్రక్కు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్, ఆపరేటర్​ చాకచక్యంగా వ్యవహరించిన త్రుటిలో ప్రాణాలు కాపాడుకున్నారు.  

ఇదీ జరిగింది..40 ఎల్​పీజీ గ్యాస్​ సిలిండర్లతో ఓ ట్రక్కు ఘన్సాలీ వైపు వెళ్తోంది. కందిఖాల్​ సమీపంలోకి రాగానే ట్రక్కులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ట్రక్కులో ఉన్న సిలిండర్లు భారీ శబ్ధంతో పేలి.. చాలా దూరం ఎగిరిపడ్డాయి. భారీ శబ్ధాలు విన్న స్థానికులు.. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ, మంటలు ఎగసిపడుతుండటం వల్ల పూర్తిగా ఆర్పలేకపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ట్రక్కు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్​, ఆపరేటర్​ చాకచక్యంగా వ్యవహరించి ప్రాణాలు కాపాడుకున్నారు. ట్రక్కు కాలిపోతున్న దృశ్యాలను స్థానికులు తమ మొబైళ్లలో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. 

ABOUT THE AUTHOR

...view details