గ్యాస్ సిలిండర్ పేలుతుందేమో అని భయపడుతున్నారా? - ఇలా చేస్తే మీరు సేఫ్ - gas explosion at home
Published : Jan 4, 2024, 6:39 AM IST
Gas Cylinder Safety Precautions : ప్రస్తుతమున్న జీవనశైలిలో వంట విషయంలో గ్యాస్ వినియోగం తప్పనిసరి అయిపోయింది. ఉదయం లేచింది మెుదలు రాత్రి పడుకునే వరకు మహిళలు వంట గదిలో ఏదో ఒక వంటకం చేస్తూనే ఉంటారు. మరి, మన వంటింట్లోని గ్యాస్ సిలిండర్ వినియోగించేటప్పుడు కనీస పరిజ్ఞానం అవసరం. గ్యాస్‌బండ వల్ల మనకు ప్రాణహాని ఉందని తెలిస్తే కచ్చితంగా జాగ్రత్త వహించాల్సిందే.
నిత్యం గ్యాస్ సిలిండర్ పేలి జరుగుతున్న అగ్నిప్రమాదాల నుంచి మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. గ్యాస్‌స్టవ్‌ను ఎల్లప్పుడూ గ్యాస్‌బండ కంటే ఎత్తులో పెట్టాలి. అలాగే వంటగదిలో ఫ్రిడ్జ్, మండే స్వభావం ఉన్న వస్తువులను ఉంచకూడదని అగ్నిమాపక అధికారులు సూచిస్తున్నారు. సాధారణంగా గ్యాస్ సిలిండర్ పేలింది అని వింటూ ఉంటాం. కానీ, వాస్తవానికి సిలిండర్ పేలడం అనేది ఉండదు అంటున్నారు ఫైర్‌సేఫ్టీ అధికారులు. కొన్ని సార్లు నిర్లక్ష్యం, అజాగ్రత్త వల్లనో ప్రమాదాలు జరుగుతుంటాయని చెబుతున్నారు. ప్రమాదం జరగక ముందు అదే విధంగా ప్రమాదం జరిగిన తర్వాత తీసుకునే జాగ్రత్తలుంటాయని అంటున్నారు. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.