Ganesh Idol on Head Pin in Jagtial : గుండు పిన్నుపై గణపతి ప్రతిమ.. భళా అనిపించేలా సూక్ష్మ కళాకారుని ప్రతిభ - సూక్ష్మ గణపతి విగ్రహం 2023
Published : Sep 18, 2023, 1:42 PM IST
Ganesh Idol on Head Pin in Jagtial : వినాయక చవితి(Ganesh Chaturthi 2023).. ప్రజలకు ఆనందాన్నే కాదు.. ఆరోగ్యాన్నీ పంచే పండుగ. ఈ పండుగ పర్యావరణ పరిరక్షణ పరమార్థాన్ని చాటుతూ.. ఏటా ప్రజలను మేల్కొలుపుతుంటుంది. చుట్టూ ఉండే ప్రకృతిని, సహజ వనరులను పరిరక్షించుకుందామని పిలుపునిచ్చే ఈ పండుగ.. పల్లెల నుంచి పట్నం వరకు ఎంతో జోరుగా సాగుతుంటుంది. కొందరు తొమ్మిది రోజులు.. మరికొందరు 11 రోజులు బొజ్జ గణపయ్యను నిత్యం పూజలతో ఆరాధిస్తుంటారు. అయితే జగిత్యాల సూక్ష్మ కళాకారుడు(Miniature Artist) వినాయక చవితికి గానూ తన ప్రతిభను వినూత్నంగా చాటుకున్నాడు.
Ganesh Idols Telangana 2023 :జగిత్యాల జిల్లా కేంద్రంలోని వాణీనగర్కు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు డాక్టర్ గుర్రం దయాకర్.. మరోసారి తన ప్రతిభ చాటాడు. గణపతి నవరాత్రుల సందర్భంగా.. గుండు పిన్నుపై చంద్రయాన్ 3, జీ 20 భారతదేశం జెండా పట్టుకుని నిలబడి ఉన్న గణపతిని తయారు చేశాడు. అత్యంత సూక్ష్మంగా తయారు చేసిన ఈ లంబోదరుడు.. ప్రస్తుతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. పొడవు 6 ఎంఎం, వెడల్పు 4 ఎంఎం ఉంటుందని, ఈ విగ్రహం తయారీకి 8 గంటల సమయం పట్టిందని దయాకర్ తెలిపారు.