తెలంగాణ

telangana

Ganesh Idol Blessings To Devotees : లేచి నిలబడి భక్తులను ఆశీర్వదిస్తున్న వినాయకుడు!.. ఎక్కడో తెలుసా?

By ETV Bharat Telugu Team

Published : Sep 22, 2023, 12:15 PM IST

Ganesh Idol Blessings To Devotees

Ganesh Idol Blessings To Devotees : గణేశ్ నవరాత్రుల సందర్భంగా బంగాల్​లో వినూత్నంగా ఏర్పాటు చేసిన పూజామండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కోల్​కతాలో సెన్సార్ సహయంతో ప్రత్యేకంగా  ఏర్పాటు చేసిన విగ్రహం భక్తులు గణేశుని పాదాలకు నమస్కరించిన వెంటనే లేచి నిలబడి ఆశీర్వదం అందిస్తోంది. దీంతో ఆ గణనాథుడిని చూసేందుకు విశేషంగా భక్తులు తరలివస్తున్నారు.  

"వినాయక మండపంలో గణేశుడితో పాటు లోకేనాథ్, మహాదేవ్​, కాళీమాత, చైతన్య విగ్రహాలు ఉన్నాయి. అందువల్ల ఈ ప్రాంగణానికి పాంచ్​ధామ్ అని పేరు పెట్టాం. ఈ పూజామందిరానికి వచ్చే భక్తులు గణాధిపతితో పాటు దేవదేవతలందరినీ చూసే అవకాశం కలుగుతోంది."

-బిప్లబ్​ దేవ్​, వినాయక మండప నిర్వాహకుడు

"ఈ ఏడాది వినాయక మండప అలంకరణ చాలా బాగుంది. చాలా కొత్తగా ఉంది. అందరూ ఈ మండపాన్ని సందర్శించాలి. నిర్వాహకులు.. భక్తుల కోసం మంచి ఏర్పాట్లు చేశారు. గణనాథుడితోపాటు లోకేనాథ్, మా తార, చైతన్య ఉన్నారు" అని ఉత్పల్​ సహ అనే భక్తుడు తెలిపాడు.

ABOUT THE AUTHOR

...view details