తెలంగాణ

telangana

Ganesh Gold Laddu Vellam in Hyderabad

ETV Bharat / videos

Ganesh Gold Laddu in Hyderabad : బొజ్జ గణపయ్య బంగారు లడ్డూ వేలం.. ఎంత ధర పలికిందంటే..? - హైదరాబాద్​లో బంగారు లడ్డూ వేలం

By ETV Bharat Telangana Team

Published : Sep 25, 2023, 1:23 PM IST

Ganesh Gold Laddu Velam Pata in Hyderabad : రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి మండపం దగ్గర భక్తుల సందడితో ఆహ్లాదంగా మారుతోంది. గణపతి ఉత్సవాల్లో విగ్రహా ప్రతిష్టించడం, నిమజ్జనం ఎంత వైభవంగా చేస్తారో.. అలానే లడ్డూ వేలపాట కూడా అంతే ఘనంగా నిర్వహిస్తారు. ఓ మండపంలోని వినాయకుని లడ్డూని బంగారంతో తయారు చేశారు. దీంతో భక్తులను ఎక్కువగా ఆకట్టుకుంటుంది.  

Vinayaka Chavithi Celebrations in Telangana హైదరాబాద్​లోని నారాయణగూడ పరిధిలోని స్ట్రీట్​ నెం.5లో వినాయకుడి చేతిలో ప్రత్యేకంగా తులం బంగారంతో చేసిన లడ్డూ(Gold Laddu)ను పెట్టారు. నిమజ్జనం రోజు నిర్వహకులు 15 కిలోల లడ్డూతో కలిపి దాన్ని వేలం వేశారు.  ఈ పాట రూ.1,116తో మొదలయింది. భక్తులు ఆ లడ్డూని పొందేందుకు అధిక సంఖ్యలో పాల్గొని.. వేలం పాటను ఆసక్తిగా మలిచారు. చివరికి హిమాయత్​నగర్​కి చెందిన సంధ్యారాణి రూ.1.36 లక్షలకు దక్కించుకున్నారు. అనంతరం బొజ్జ గణపయ్యని నిమజ్జన కార్యక్రమంలో భాగంగా ఊరేగించారు. డీజే పాటలు, తీన్మార్​ డాన్స్​లు మధ్య సందడిగా గణపతిని భక్తులు నిమజ్జనం చేశారు.  

ABOUT THE AUTHOR

...view details