Ganesh Chaturthi Celebration in Canada 2023 : కెనడాలో భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా గణపతి నవరాత్రి ఉత్సవాలు - Canada Chaturthi Celebration
Published : Oct 2, 2023, 12:28 PM IST
Ganesh Chaturthi Celebration in Canada 2023: కెనడాలో శ్రీ అనఘా దత్త సొసైటీ ఆఫ్ కాల్గరీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సుమారు ఐదు వందలకు పైగా భక్తులు పాల్గొన్నారు. మేళ తాళాలు, సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు, భగవన్నామ స్మరణ చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. గణనాథుని యాత్రలో కాల్గరీ ఎమ్మెల్యే పీటర్ సింగ్ పాల్గొని కార్యక్రమాలు నిర్వహిస్తున్న భక్తులను, ప్రజలను శ్రీ అనఘా దత్త యజమాన్యం వారిని ప్రశంసించారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రాజ్‌కుమార్ శర్మ మందిరంలో ప్రతిరోజు గణపతి అభిషేకము, అర్చన, గణపతి హోమము, హారతులు విధిగా నిర్వహించారు.
వాలంటీర్లు, వ్యాపార యజమానులు గణపతి నవరాత్రి, ఊరేగింపు సంబరాలు ఘనంగా నిర్వహించేందుకు తోర్పడ్డారు. భక్తులు ఆనందంతో నాట్యం చేస్తూ, గణపతి నామ సంకీర్తన చేస్తూ వినాయక నిమజ్జనం చేశారు. ఉత్తర అమెరికా ఖండంలో ఇటువంటి వేడుకలు జరపడం కష్టమైనప్పటికీ శ్రీ అనఘా దత్తా సొసైటీ ఆఫ్ కాల్గరీ యాజమాన్యం సభ్యులు ఎన్నో దైవ కార్యక్రమాలు నిర్వహిస్తూ రానున్న భావితరాలకు భారత సంప్రదాయ పూల బాటలు వేస్తున్నారని అందరూ ప్రశంసించారు.