తెలంగాణ

telangana

Ganesh Chaturthi celebrations at Pragathi Bhavan

ETV Bharat / videos

Ganesh Chaturthi 2023 Celebrations at Pragathi Bhavan : ప్రగతి భవన్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు.. కేసీఆర్ కుటుంబం పూజలు - telangana latest news

By ETV Bharat Telangana Team

Published : Sep 18, 2023, 8:04 PM IST

Ganesh Chaturthi 2023 Celebrations at Pragathi Bhavan : వినాయక చవితి సందర్భంగా కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్​లో వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రగతి భవన్ ప్రాంగణంలో ప్రతిష్టించిన మట్టి గణనాథుని విగ్రహానికి ముఖ్యమంత్రి కేసీఆర్, సతీమణి శోభ ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, శైలిమ దంపతులు, కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రగతిభవన్ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు సుఖ‌శాంతుల‌ు అందించాల‌ని, ప్రజలందరినీ చల్లగా చూడాలని, రాష్ట్ర ప్రగతి ప్రస్థానానికి విఘ్నాలు రాకుండా చూడాల‌ని విఘ్నేశ్వరుడిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రార్థించారు.  

గణనాథుని సేవలో రాష్ట్ర ప్రముఖులు తరించారు. కొందరు రాజకీయ నేతలు తమ తమ పార్టీ కార్యాలయాల్లో, అధికారిక నివాసాల్లో చవితి వేడుకలు జరుపుకోగా.. మరికొందరు ఖైరతాబాద్​ మహా గణపతిని సేవించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గణపతి ఉత్సవాల సందడి నెలకొంది. వాడవాడలా బొజ్జ గణపయ్యను నిలిపించేందుకు నిర్వాహకులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో విగ్రహాల కొనుగోళ్లు జోరుగా సాగాయి. 

ABOUT THE AUTHOR

...view details