Gaddar son-in-law reaction : ఐసీయూలోనూ పాటలు పాడటం ఆపలేదు : గద్దర్ అల్లుడు - Gaddars son in law reaction
Gaddar son-in-law reaction : ప్రజా గాయకుడు గద్దర్ అనారోగ్యంతో .. అపోలో ఆస్పత్రిలో ఆదివారం కన్నుమూశారు. ఆసుపత్రిలో గద్దర్ ఎలా ఉన్నారో ఆయన అల్లుడు శ్రీకాంత్ వివరించారు. గుండెకి సంబంధించిన శస్త్ర చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరారని.. ఐసీయూలో ఉన్నప్పుడు కూడా గద్దర్ పాటలు పాడారని తెలిపారు. వైద్యులు గుండె సంబంధించిన అనారోగ్యంతో చనిపోయారని చెప్పినట్లు శ్రీకాంత్ తెలిపారు. ఆయన ఆసుపత్రిలో ఉన్నా.. ఆరోగ్యం సహకరించకపోయినా పాటలు పాడటం మాత్రం ఆపలేదన్నారు. ఐసీయూలో కూడా పాటలు పాడుతూ అందరిని ఉత్సాహపరిచారని తెలిపారు. అనారోగ్యంపై ఎప్పుడు బాధపడలేదని.. ప్రజాసమస్యల పరిష్కారం కోసం గద్దర్ నిరంతరం శ్రమించే వారిని చెప్పారు. గద్దర్ మరణవార్త విని ఆయన అభిమానులు, పలువురు రాజకీయ నాయకులు ఆసుపత్రికి వచ్చి నివాళులు అర్పించారు. జననాట్య మండలి విమలక్క, గోరెటి వెంకన్న ఆసుపత్రికి వచ్చి గద్దర్ గొప్పతనాన్ని వివరిస్తూ పాటలు పాడారు. కాసేపటిక్రితం గద్దర్ పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఎల్బీ స్టేడియానికి తరలించారు.