Gaddar last rites in Secunderabad : మహాబోధి పాఠశాలలో గద్దర్ అంత్యక్రియలు.. అక్కడే ఎందుకు? - మహాబోధి పాఠశాల
Gaddar last rites at Mahabodhi School in Secunderabad: ప్రజాయుద్ద నౌక గద్దర్ పేద విద్యార్థుల కోసం సికింద్రాబాద్ అల్వాల్‌లోని మహాబోధి అనే పాఠశాలను నెలకొల్పారు. నర్సరీ నుంచి పదో తరగతి వరకు పేద విద్యార్థులకు విద్యానందించాలనే లక్ష్యంతో గద్దర్ మహాబోధి పాఠశాలను ఏర్పాటు చేశారని సిబ్బంది తెలిపారు. గద్దర్ మరణవార్త విని సిబ్బంది భావోద్యోగానికి గురయ్యారు. అయితే గద్దర్‌కు అత్యంత ఇష్టమైన మహాబోధి పాఠశాలలోనే అంత్యక్రియలు నిర్వహించాలని గద్దర్ కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆ స్కూల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. వీటికి సంబంధించిన ఏర్పాట్లను మేడ్చల్ డీసీపీ శబరీష్ పరిశీలించారు. ప్రస్తుతం ఎల్బీస్టేడియంలో గద్దర్ పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో వెళ్లి చూసి.. సంతాపం వ్యక్తం చేస్తున్నారు. స్టేడియంలో సందర్శనం అయిన తరువాత రేపు అల్వాల్‌లోని మహాబోధి పాఠశాలకు తరలించి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది గద్దర్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.