మంచు దుప్పటిలో శ్వేతవర్ణ శోభితంగా కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి - బద్రీనాథ్‌లో కురుస్తున్న మంచు
ఉత్తరాఖండ్‌లోని బద్రినాథ్, కేదార్నాథ్, కేదార్ మద్మదేశ్వర్, కేదార్ తంగ్నాథ్, కార్తికేయ లాంటి ప్రసిద్ధ ఆలయాలను మంచు దుప్పటి కప్పేసింది. ఉష్ణోగ్రతలు కనిష్ఠస్థాయికి చేరుకోవడంతో ఆ ప్రాంతంలో భారీగా మంచు కురుస్తోంది. దీంతో ప్రసిద్ధ ఆలయాలు, పరిసర ప్రాంతాలు శ్వేత వర్ణాన్ని సంతరించుకున్నాయి. మంచు కురుస్తుండటం వల్ల పర్యటకులు తాకిడి కూడా పెరిగింది. మంచు పడుతుండటం వల్ల కేదార్నాథ్ రెండో దశ పునర్నిర్మాణ పనులు ఆగిపోయాయి. అటు హిమాచల్‌ప్రదేశ్ శిమ్లాలోనూ ఉష్ణోగ్రతలు భారీగా పతనమవుతున్నాయి. ఎటు చూసిన మంచుతో పేరుకుపోయిన ఇళ్లు, రోడ్లు దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా నరకంద ప్రాంతంలోని రహదారిని హిమపాతం ముంచెత్తింది. రోడ్డుకు ఇరువైపులా మంచు పేరుకుపోయింది.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST