ఆటో డ్రైవర్ గొప్ప మనసు - అలాంటి వారి కోసం నగరంలో ఉచితంగా మంచి నీటి పంపిణీ - auto driver free water
Published : Jan 5, 2024, 4:31 PM IST
|Updated : Jan 5, 2024, 6:08 PM IST
Free Drinking Water Supply : ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో సంపాదించిన సొమ్మును కొంత దాచుకొని, మిగిలిన దానితో కొంత అయినా సేవ చేస్తే ఆ భగవంతుడు తన కుటుంబాన్ని కాపాడుతాడని అంటున్నాడు సయ్యద్ జమీల్. ప్రజలకు కొంత మేరకు అయినా సేవ చేయాలనే లక్ష్యంతో టోలిచౌకీకి చెందిన సయ్యద్ జమీల్(45), తన ఆటోలో మంచి నీటి క్యాన్లను పెట్టుకుని ఉచితంగా నీటిని పంపిణీ చేస్తున్నాడు.
Free Water Supply :శుక్రవారం రోజున ప్రజావాణి కార్యక్రమానికి హాజరైన ప్రజలకు ఉచితంగా మంచి నీటిని పంపిణీ చేశాడు. ఈ సందర్భంగా సయ్యద్ జమీల్ మాట్లాడారు. పేద ప్రజలు డబ్బులు పెట్టి వాటర్ కొనకుండా ఉండేందుకే తాను మంచి నీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపాడు. మరోవైపు కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ అన్నదమ్ముల్లాగా కలిసి మెలిసి ఉండేందుకు తాను మంచి నీటి సరఫరా చేస్తున్నానని చెప్పాడు. నగరంలో రద్దీ ప్రాంతాల్లో, ముఖ్యంగా రైల్యే స్టేషన్ పరిసరాల్లో మంచి నీటిని పంపిణీ చేస్తున్నట్లు జమీల్ పేర్కొన్నాడు.