తెలంగాణ

telangana

JP Speech In Forum For Good Governance

ETV Bharat / videos

Forum For Good Governance Meeting : దేశంలో కల్మషం లేని రాజకీయ పార్టీలు ఎక్కడా లేవు : జయప్రకాశ్ నారాయణ

By

Published : Jul 31, 2023, 5:29 PM IST

Jayaprakash Speech In Forum For Good Governance : రాజ్యాంగంలో ఉన్న ఓటు అన్న పదానికి అర్థాన్ని తెలుసుకోకుండా నేడు ప్రజలు జీవిస్తున్నారని లోక్‌సత్తా పార్టీ నాయకుడు జయప్రకాష్‌ నారాయణ అన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో ఉన్న లోటుపాట్లను వేలెత్తి చూపుతూ.. ఫోరమ్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ సంస్థ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో ఫోరమ్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్​ సంస్థ అధ్యక్షుడు పద్మనాభ రెడ్డి, తదితర సభ్యులు కూడా పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజకీయ నాయకులు, పార్టీలు, చేరికలు అంశంగా చర్చించారు. నేటి రాజకీయ నాయకుల్లో సగానికి పైగా నేర చరిత్ర ఉన్నవారేనని జయప్రకాశ్‌ నారాయణ అన్నారు. 'నేడు మన రాజకీయాల్లో జరుగుతుంది ఉన్మాదం... ఎందుకో తెలియదు ఈ పదవుల లాలస. పదవే పరమావధిగా.. పదవి దక్కదేమోనన్న భయం ఈనాటి నాయకులలో పట్టుకుంది' అని జేపీ ప్రస్తుత రాజకీయ ధోరణిని విమర్శించారు. పూర్తిగా కల్మషం లేని రాజకీయ పార్టీలు ఎక్కడా లేవన్నారు. ప్రజలకు ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకునేందుకు వారికి సరైన అవగాహన కల్పించే ప్రయత్నం చేయాలని ఆయన కోరారు. 

ABOUT THE AUTHOR

...view details