Ponguleti on Crop Loss : 'రైతులకు ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి' - బీఆర్ఎస్
Ponguleti Rally with Farmers in khammam : అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నదాతలతో కలిసి ఖమ్మం పట్టణంలో ర్యాలీ చేపట్టారు. తడిసిన ప్రతి గింజా కొనాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులపై ప్రభుత్వానికి కనీస పట్టింపు లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గత మార్చి నెలలో వరంగల్లో పర్యటించిన సందర్భంగా.. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు కానీ ఇంతవరకు ఒక్క రైతు బ్యాంక్ అకౌంట్లోనూ ఒక్క రూపాయీ జమ చేయలేదని విమర్శించారు.
'రాష్ట్రవ్యాప్తంగా ఏదో మొక్కుబడిగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఎక్కడా క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలు ప్రారంభం కాలేదు. అకాల వర్షాలతో కల్లాల్లోనే ధాన్యం ఉండిపోయింది. పండించిన ధాన్యం.. తడిసి మొలకెత్తి అఖరుకు నేల పాలైపోతోంది. మొక్కజొన్న రైతుల పరిస్థితి మరింత ఘోరంగా మారింది. వాటిని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్న నమ్మకం కూడా లేదు. రాష్ట్రప్రభుత్వం తక్షణమే పంట నష్టపోయిన రైతులకు.. ప్రతి ఎకరాకు వెంటనే రూ.30 వేలు చెల్లించాలి' అంటున్న పొంగులేటితో మా ప్రతినిధి ప్రత్యేక ముఖాముఖి..