PIL on Jagan Cases: జగన్ కేసులు త్వరగా తేల్చండి.. తెలంగాణ హైకోర్టులో హరిరామజోగయ్య పిల్ - Telangana High Court Registry
Harirama Jogaiah PIL in Telangana High Court: జగన్ అక్రమాస్తుల కేసులపై మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. సీబీఐ కోర్టులో జగన్ కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా ఆదేశించాలని, 2024 అసెంబ్లీ ఎన్నికల్లోపే కేసులు తేల్చేలా ఆదేశాలివ్వాలని హరిరామ జోగయ్య హైకోర్టును కోరారు. కాగా, జోగయ్య పిల్‌ను అనుమతించేందుకు తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం వ్యక్తం చేశారు. వ్యక్తిగత కేసులపై పిల్ వేయడం సరికాదని పేర్కొంటూ.. అభ్యంతరాలు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సీజే ధర్మాసనం ముందుంచారు. రిజిస్ట్రీ అభ్యంతరాలపై వాదనలు విన్న సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్. తుకారాం బెంచ్.. హరిరామయ్య న్యాయవాదిని ఉద్దేశించి వేగంగా విచారణకు పీపీని ఆదేశించేలా సీబీఐ డైరెక్టర్‌ను కోరారా? అని ప్రశ్నించింది. సీబీఐ డైరెక్టర్‌ను అడగకుండా నేరుగా కోర్టుకు ఎందుకు వచ్చారని, ప్రచార ప్రయోజనాల కోసం పిల్ వేశారా అని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. 2 వారాలు గడువిస్తే పిల్ విచారణార్హతపై వాదిస్తామని జోగయ్య తరఫు న్యాయవాది బదులివ్వగా.. రిజిస్ట్రీ అభ్యంతరాలపై విచారణను హైకోర్టు జులై 6కి వాయిదా వేసింది.