మద్యం మత్తులో మాజీ హోం మంత్రి కుమారుడు హల్చల్
ఛత్తీస్‌గఢ్ మాజీ హోం మంత్రి రామ్‌పుర్ ఎమ్మెల్యే నానకీరామ్ కంవర్ కుమారుడు సందీప్ మద్యం మత్తులో హల్చల్ చేశారు. బస్సు కండక్టర్‌పై దాడికి యత్నించారు. అక్కడితో ఆగకుండా బస్సు ఎదురుగా పడుకొని వాహనాన్ని కదలకుండా చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సందీప్‌ను అక్కడి నుంచి తరలించారు. ఈ దృశ్యాలను ఓ స్థానికుడు మొబైల్ బంధించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST