ఓటు ఉందో లేదో ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి: మాజీ ప్రధాన ఎన్నికల అధికారి ఖురేషీ - Qureshi interview
Published : Dec 31, 2023, 3:32 PM IST
Former CEC Qureshi Interview: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకం కోసం కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన చట్టం లోపభూయిష్టంగా ఉందని మాజీ ప్రధాన ఎన్నికల అధికారి ఖురేషీ అన్నారు. సీఈసీ ఎంపికలో సీజేఐని తొలగించడం సరికాదన్న ఆయన న్యాయవ్యవస్థ ముందు ఈ చట్టం నిలబడదని స్పష్టం చేశారు. పోలింగ్ వేసే రోజునే ఓటు ఉందో లేదో చూసుకోవడం సరికాదన్న ఖురేషీ ముందుగానే సరిచూసుకోవాలని సూచించారు. లేకపోతే బీఎల్‌వో, అధికారుల ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు. తుది ఓటర్ల జాబితా ప్రకటించేందుకు జనవరి 22 వరకూ సమయం ఉందన్న ఖురేషీ అర్హత ఉన్న వారందరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వీడాలని ఆయన చెబుతున్నారు. కొత్తగా ఓటు నమోదు చేసుకోవడానికి ఇదే సరైన సమయమని సూచించారు. ఈసీ ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని ఆయన గుర్తు చేశారు. ఈసీ వివిధ రూపాల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. ఫలితంగానే ఓటర్లలో అవగాహన పెరిగి పోలింగ్‌కు వస్తున్నారంటున్న ఖురేషీతో మా ప్రతినిధి శ్రీనివాస్‌మోహన్ ముఖాముఖి.