తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఇళ్ల మధ్యలో చిరుత హల్​చల్.. స్థానికులు హడల్.. మత్తు మందు ఇచ్చి.. - ఇళ్లలో చిరుత హల్​చల్

By

Published : Jul 6, 2022, 11:17 AM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

leopard in haridwar: ఉత్తరాఖండ్ హరిద్వార్​లో చిరుత హల్​చల్ సృష్టించింది. నగరంలోని నివాస స్థలాల మధ్య తిరుగుతూ స్థానికులను భయాందోళనకు గురిచేసింది. హర్​కీ పైడి ప్రాంతంలోని ఓ హనుమాన్ మందిరం వద్ద చిరుత కనిపించిందని స్థానికులు తెలిపారు. ఇళ్ల మధ్య తిరుగుతున్న చిరుత దృశ్యాలు సోషల్ మీడియాలోనూ వైరల్​గా మారాయి. చిరుతను పట్టుకునేందుకు అటవీ అధికారులు కొద్దిరోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎట్టకేలకు మంగళవారం వణ్యప్రాణిని బంధించారు. మత్తుమందు ఇచ్చే తుపాకీని ఉపయోగించి చిరుత స్పృహ కోల్పోయేలా చేశారు. అనంతరం బోనులో బంధించారు. రాజాజీ పార్క్​లోని సంరక్షణ కేంద్రానికి చిరుతను తరలించారు.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

...view details