తెలంగాణ

telangana

Flood Water on National High Way

ETV Bharat / videos

Flood Water on National High Way : హైవేపై వరద నీరు.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు - హైవే 44పై నిలిచిన వరద నీరు

By

Published : Jul 22, 2023, 6:07 PM IST

Flood Water on 44 National High Way : రాష్ట్రవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కురుస్తోన్న ఎడతెరిపి లేని వర్షాల కారణంగా జనజీవనం అతలాకుతలం అవుతోంది. భారీ వర్షాలతో రహదారులపై వరద నీరు నిలిచి.. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. మరికొన్ని చోట్ల రోడ్లపై ప్రమాదకర స్థాయిలో నీరు ప్రవహిస్తోంది. ఆదిలాబాద్‌-నిర్మల్‌ జిల్లాల పరిధిలో ఉన్న 44 నెంబర్‌ జాతీయ రహదారిపై వరద నీరు పొంగిపొర్లుతోంది. చాందా(టి)-జందాపూర్‌ ఎక్స్‌ రోడ్డు దాటిన తర్వాత జాతీయ రహదారి పైనుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్​ నిలిచిపోయింది. సమస్య ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న దృష్టికి రావడంతో ఆయనే స్వయంగా అక్కడికి వచ్చి పరిశీలించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న జాతీయ రహదారి అధికారులు, గుత్తేదారులపై మండిపడ్డారు. వెంటనే అధికారులతో మాట్లాడి.. జాతీయ రహదారిపై నిలిచిన నీటి తరలింపునకు చర్యలు చేపట్టారు. మరోవైపు.. రహదారికి ఆనుకొని సరైన డ్రైనేజీ, మురికి కాలువల వ్యవస్థ లేకపోవడంతోనే ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని స్థానికులు ఆరోపించారు. వరద నీరు చేరడంతో పంట పొలాలన్నీ నీట మునిగాయని వాపోయారు. ఎమ్మెల్యే రామన్న.. పొలాలు నీట మునిగిన స్థానిక రైతులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details