తెలంగాణ

telangana

Flood Water Flowing in Chinthal

ETV Bharat / videos

Flood Water Flowing in Chinthal : నీటమునిగిన చింతల్.. ఇళ్లలోకి చేరిన వరద నీరు - చింతల్​లో భారీ వర్షాలు

By ETV Bharat Telangana Team

Published : Sep 5, 2023, 7:23 PM IST

Flood Water Flowing in Chinthal :తెల్లవారుజాము నుంచి ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని చింతల్, ఇంద్రసింగ్​ నగర్​లో వరద నీరు(Flood Water) భారీగా ప్రవహిస్తోంది. కొన్ని ఇళ్లలోకి సైతం వరద నీరు చేరింది. చింతల్, ఇంద్రసింగ్ నగర్​లోని ఓ అపార్ట్​మెంట్​లో సెల్లార్​లోకి నడుము లోతు నీరు రావడంతో అందులో పార్క్ చేసి ఉన్న పలు వాహనాలు పాడయ్యాయి. సెల్లార్​లోకి నీరు రావడంతో తమ ఇంట్లో సామన్లు, వంట సామాగ్రి, బట్టలు అన్ని నీటిలో మునిగి పోయాయని కన్నీరు మున్నీరు అవుతున్నారు. 

Heavy Rain in Chinthal :నాలాలలో పేరుకుపోయిన చెత్తను సరిగ్గా తీయక పోవడం వలనే ఇలాంటి దుస్థితి వచ్చిందని అపార్ట్​మెంట్ వాసులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం వచ్చింటే చాలు ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయని వాపోతున్నారు. ఇంద్రసింగ్​ నగర్​ అంటేనే జలమయంలా ఉందంటున్నారు. ఉదయం నుంచి ఇళ్లల్లోకి నీరు చేరిన ఇప్పటికీ అధికారులు వారి వద్దకు రాలేదని చెబుతున్నారు. మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా వరద ప్రాంతాల్లో దృష్టి పెట్టాలని కోరుతున్నారు. 

ABOUT THE AUTHOR

...view details