తెలంగాణ

telangana

Five Crore Cash Seized at Gachibowli Police Station

ETV Bharat / videos

గచ్చిబౌలిలో రూ.5 కోట్ల నగదు పట్టివేత, ఐటీ అధికారులకు అప్పగింత - హైదరాబాద్‌లో 5 కోట్ల నగదు స్వాధీనం

By ETV Bharat Telangana Team

Published : Nov 23, 2023, 3:58 PM IST

Updated : Nov 23, 2023, 4:44 PM IST

Five Crore Cash Seized at Gachibowli Police Station : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో గచ్చిబౌలి పీఎస్‌ పరిధిలోని పోలీసులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. శ్రీరామ్ నగర్ కాలనీలో తనఖీలు చేసి రెండు కార్లలో తరలిస్తున్న రూ.5 కోట్లను మాదాపూర్ ఎస్‌ఓటీ, పోలీసులు పట్టుకున్నారు. నగదుకు సంబంధించి ఎటువంటి లెక్కలు చూపకపోవడంతో వాటిని ఐటీశాఖకు అప్పగించారు. ఈ కేసులో మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

హవాల డబ్బు ఓ వ్యాపార వేత్తగా పోలీసులు చెబుతుండగా.. పట్టుబడ్డ ఎనిమిది మంది పెద్దపల్లి జిల్లాకు చెందిన వారు కావడం గమనార్హం. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నిన్నటి వరకు రూ.657.60 కోట్లు మొత్తం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గడిచిన 24 గంటల్లో రూ.18.06 కోట్లు స్వాధీనం చేసుకోగా.. తాజాగా ఇవాళ గచ్చిబౌలి పోలీస్​ స్టేషన్​ పరిధిలోని రూ. 5 కోట్ల నగదును పట్టుకున్నారు. 

Last Updated : Nov 23, 2023, 4:44 PM IST

ABOUT THE AUTHOR

...view details