మత్స్యకారుల పడవ మునక.. సముద్రంలో దూకిన 19మంది.. ఆ తర్వాత.. - నడి సముద్రంలో మునిగిపోయిన పడవ
చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల పడవ సముద్రంలో మునిగిపోయింది. తమిళనాడు కన్యాకుమారిలో ఈ ఘటన జరిగింది. ముట్టమ్ గ్రామానికి చెందిన 19 మంది మత్స్యకారులు సెప్టెంబర్ 22న సముద్రంలోకి చేపల వేటకు వెళ్లారు. సెప్టెంబర్ 24న సముద్రం మధ్యలో ఉండగా భారీ అలలు వచ్చాయి. దీంతో పడవ ఒక్కసారిగా నీటిలో మునిగిపోయింది. వెంటనే మత్స్యకారులు నీళ్లలో దూకేశారు. పక్కనే మరో పడవ ఉండటం వల్ల పెను విషాదం తప్పినట్లైంది. అందరూ రెండో పడవలోకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. కులాచల్ తీర ప్రాంత పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. పడవ మునిగిపోయిన దృశ్యాలను విడుదల చేశారు.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST